కేటీఆర్ మామ కన్నుమూత

రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ మామ పాకాల హ‌రినాథ్‌రావు(72) గురువారం మ‌ధ్యాహ్నం గుండెపోటుకు గురై క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న హ‌రినాథ్‌.. గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గుర‌య్యాడు. విష‌యం తెలుసుకున్న కేటీఆర్, ఆయ‌న భార్య శైలిమ‌, ఇత‌ర కుటుంబ స‌భ్యులు హుటాహుటిన ఏఐజీ ఆస్ప‌త్రికి వెళ్లారు. అనంత‌రం హ‌రినాథ్‌రావు మృత‌దేహాన్ని రాయ‌దుర్గంలోని ఓరియ‌న్ విల్లాస్‌లో ఉన్న ఆయ‌న నివాసానికి త‌ర‌లించారు. హ‌రినాథ్‌రావు పార్థివ‌దేహానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. సీఎంతో పాటు ఎమ్మెల్సీ క‌విత‌, ఎంపీ సంతోష్ కుమార్‌, మంత్రి మ‌హ‌ముద్ అలీ, మేయ‌ర్ గద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి కూడా నివాళుల‌ర్పించి, కుటుంబ స‌భ్యుల‌కు సంతాపం ప్ర‌క‌టించారు.

Leave a Reply

%d