మహాప్రస్థానంలో చలపతిరావుకి అంతిమ వీడ్కోలు

ఈ ఏడాది తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస విషాదాలు చోటు చేసుకోవడం ఊహించని అంశంగా మారింది. పైగా మన ఇండస్ట్రీ కి చెందిన సీనియర్ నటులే ఈ ఏడాది కన్ను మూయడం అనేది మరో పెద్ద షాకింగ్ అంశం. ఈ కొన్ని నెలల వ్యవధి లోనే రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు అలాగే మొన్ననే నటులు కైకాల సత్యన్నారాయణ గారు కన్ను మూశారన్న వార్తలతో టాలీవుడ్ లో తీవ్ర విషాదాలు నెలకొన్నాయి. మరి ఈ వార్తలు మరవక ముందే మరో సీనియర్ ఆర్టిస్ట్ చలపతి రావు గారు కన్ను మూశారన్న వార్త ఈ ఉదయం వినాల్సి వచ్చింది. మరి తాను ఆర్టిస్ట్ గా 1200కి పైగా సినిమాలు చేయగా నిర్మాతగా కూడా పలు చిత్రాలు చేశారు. మరి నిన్న రాత్రి అయితే తాను ఆకస్మిక గుండెపోటు కారణంగా తన 78వ ఏట కన్ను మూసినట్టుగా తెలిసింది. దీనితో ఈ వార్త విన్న టాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఆయన పార్థివదేహాన్ని అయితే హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో తన కుమారుడు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ రవి బాబు ఇంట్లో ప్రస్తుతం ఉంచడం జరిగింది. మరి తరువాత ఈ మధ్యాహ్నం 3 గంటల సమయంలో మహా ప్రస్థానానికి పార్థివ దేహాన్ని చేర్చి ఫ్రీజర్ లో ఉంచడం జరుగుతుంది. అయితే చలపతిరావు గారి కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. ఆమె ఈ బుధవారానికి చేరుకుంటారు. దీనితో తాను రాగానే మహాప్రస్థానం లో చలపతిరావు గారికి అంతిమ వీడ్కోలు కుటుంబీకులు సినీ ప్రముఖులు అందివ్వనున్నారు.

Leave a Reply

%d