ఇటీవల కన్నుమూసిన రాకేష్ మాస్టర్ మూడో భార్య లక్ష్మీపై నగరంలోని పంజాగుట్ట ఏరియాలో కొందరు మహిళా యూట్యూబర్లు దాడికి పాల్పడ్డారు. స్కూటీపై వెల్తున్న లక్ష్మీని అడ్డుకుని లల్లీ అనే యూట్యూబర్ మరో నలుగురు మహిళలు జుట్టు పట్టుకుని కొట్టారు. విషయం పోలీసులకు చేరడంతో వీరిరువురిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. యూట్యూబ్ విషయంలో వీరి మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. దాడికి దిగిన లల్లీ యూట్యూబ్ లో స్పందిస్తూ మైనర్ అయిన తన కూతురుపై లక్ష్మీ అసభ్యంగా మాట్లాడిందని ఆరోపించింది. మరోవైపు లక్ష్మీ మాట్లాడుతూ తనను యూట్యూబ్ విడిచి వెళ్లాలని బెదిరిస్తున్నారని, తనను అంతమొందించాలని చూస్తున్నారని, దానిలో భాగంగానే తనపై దాడికి పాల్పడ్డారని తెలిపింది. తనపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. ఇద్దరి నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు స్టేషన్ నుంచి వారిని పంపించేశారు.