లోన్ యాప్ వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యాయత్నం

ఆన్ లైన్ లోన్ యాప్ ల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రఘునాథపాలెం మండలం బాపూజీ తండాకు చెందిన భూక్య ఆకాష్(18) కు ఎం ప్యాకెట్ ధని అనే యాప్ ద్వారా రూ.6 వేలు లోన్ తీసుకున్నాడు. యాప్ నిర్వాహకులు వేధించడంతో వారం రోజులు కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు.

నాటి నుంచి ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్నాడు. ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది.  పూర్తి వివరాలు తెలియదని, తమ కుమారుడు లోన్ యాప్ నిర్వాహకులు  వేధింపులు తాళలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడని ఆకాశ కుటుంబ సభ్యులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

Leave a Reply

%d bloggers like this: