రేపే లోకేష్ పాదయాత్ర

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్ర రేపు ఉదయం కుప్పంలో ప్రారంభం కాబోతోంది. రేపు ఉదయం 10.15 గంటల సమయంలో ఆయన వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం 11.03 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల పాటు ఈ సుదీర్ఘ పాదయాత్ర కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు యువగళం సభలో ఆయన పాల్గొంటారు. సభ అనంతరం కుప్పంలో ప్రభుత్వ ఆసుపత్రి శెట్టిపల్లె క్రాస్, బెగ్గిలిపల్లె క్రాస్ మీదుగా యాత్ర కొనసాగుతుంది. రాత్రి సమయానికి ఆయన బస చేసే ప్రాంతానికి చేరుకుంటారు. తొలిరోజు ఆయన పాదయాత్ర 8.5 కిలోమీటర్ల మేర కొనసాగనుంది.

Leave a Reply

%d