ప్రేయసి పుట్టినరోజే ఏమైందటే

వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.. శుక్రవారం అమ్మాయి బర్త్‌డే.. గాళ్‌ఫ్రెండ్ బర్త్ డేను సెలబ్రేట్ చేసేందుకు యువకుడు పెద్ద ప్లాన్ వేశాడు.. ఢిల్లీ నుంచి ఆ అమ్మాయిని కారులో జైపూర్ తీసుకెళ్లాడు.. ఇద్దరూ ఘనంగా జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుని తిరుగు ప్రయాణమయ్యారు.. మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు (Lovers died in an Accident).. దీంతో ఇరు కుటుంబాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. గుర్గావ్‌లోని కృష్ణ కాలనీకి చెందిన కపిల్ థరేజా (29), ఉత్తర ఢిల్లీలోని (Delhi News) బరారీలో నివాసం ఉంటున్న సృష్టి గుసేన్ (22) చాలా రోజులుగా ప్రేమలో ఉన్నారు. సృష్టి చదువు పూర్తి కాగానే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వీరి వివాహానికి ఇరు కుటంబ సభ్యులు అంగీకరించారు. తన ప్రేయసి బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేయాలని కపిల్ ప్లాన్ చేశాడు. అనుకున్నట్టే సృష్టిని కారులో ఢిల్లీ నుంచి జైపూర్ తీసుకెళ్లాడు. అక్కడ జన్మదినోత్సవ వేడుకలు పూర్తయిన తర్వాత ఇద్దరూ కారులో తిరుగుప్రయాణమయ్యారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వెళ్తున్న వీరి కారు ఓ ట్ర‌క్‌ను ఢీకొట్టింది (Road Accident). ఈ ప్రమాదంలో ప్రేమికులిద్దరూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే ఇద్దరి మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. కారు బాడీని కోసి ఇద్దరి మృతదేహాలను తొలగించాల్సి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.

Leave a Reply

%d