ఆదివారం కూడా పని చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆరవ అంతస్తులోని సీఎం కార్యాలయానికి వెళ్లిన ఆయన ముందుగా నిర్ణయించిన ముహూర్తానికి కుర్చిలో ఆసీనులైనారు. ఆ తర్వాత పలు దస్త్రాలపై సుముహూర్తంలోనే సంతకాలు చేశారు. సీఎం కేసీఆర్ కార్యాయలంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వ‌చ‌నాలు అందించారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తూర్పూ గేటు నుంచి ఆయన సచివాలంలోకి చేరుకొని శిలాఫలాకాన్ని ఆవిష్కరించి నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముందుగా నిర్ణయించిన సుముహూర్తానికే కేసీఆర్ తన కుర్చీలో ఆసీనులైనారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆరు ఫైల్స్ పై సంతకాలు చేశారు. సుముహూర్తంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేసీఆర్ తొలి సంతకం చేశారు. ఫైల్స్ పై సంతకం చేసిన అనంతరం వేద పండితులు కేసీఆర్ కి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

సీఎం కేసీఆర్ త‌న ఛాంబ‌ర్‌లో ఆసీనులైన సంద‌ర్భంగా సంద‌ర్భంగా ఆల‌య ఈవో గీత యాదాద్రి ప్రసాదాన్ని కేసీఆర్‌కు అందజేశారు. నూతన సచివాలంయంలో ఆరవ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం.. మూడవ అంతస్తులో మంత్రి కేటీఆర్ కార్యాలయం, రెండో అంతస్తులో మంత్రి హరీష్ రావు కార్యాలయాలు ఉన్నాయి. 28 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు ఉంటుంది. 265 అడుగుల ఎత్తున నూతన భవనాన్ని నిర్మించారు. దేశంలోని అద్భుతమైన నిర్మాణాల్లో తెలంగాణలో కొత్తగా నిర్మించిన తెలంగాణ నూతన సచివాలయం అంటున్నారు.

Leave a Reply

%d