దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. అక్కడే ఉంటూ ప్రవాస భారతీయులతో భేటీ అవుతున్నారు. తెలంగాణాలో పెట్టుబడులకు వివిధ పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతున్నారు. తాజాగా భారతీ ఎయిర్‌టెల్ వ్యవస్థాపక చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, వైస్ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ భారతీ మిట్టల్ తో బుధవారం కేటీఆర్ సమావేశమయ్యారు.
డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికత అయిన హైపర్ స్కేల్ డేటా సెంటర్ హైదరాబాద్ లో చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే తన అనుబంధ సంస్థ అయిన నెక్స్ ట్రా ద్వారా భారతీ ఏయిర్ టెల్ ఈ డేటాసెంటర్ ను నెలకొల్పుతోంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయల కోసం 2వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడుతామని ఏయిర్ టెల్ ప్రకటించింది. అందుకు తగిన ఏర్పట్లుకూడా చేయాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్ తెలంగాణాలో తగిన వనరులు పుష్కలంగా ఉన్నాయని మౌళిక సదుపాయాలు కూడా కల్పిస్తామని..స్వయంగా విజిట్ చేయాలనీ కోరారని తెలుస్తుంది. ‘ఎయిర్‌టెల్ -నెక్స్ ట్రా తెలంగాణలో పెట్టుబడి పెట్టడం చాలా అనందంగా ఉందన్నారు. భారతదేశంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్‌లకు హైదరాబాద్ హబ్ మారిందని, ఎయిర్‌టెల్ తాజా పెట్టుబడితో తాము ఆశిస్తున్న మరిన్ని ఫలితాలు వస్తాయని నమ్ముతున్నాను అని అన్నారు.