అసెంబ్లీలో మల్లన్న కామెడీ

మంత్రి మల్లారెడ్డి స్పీచ్ ఇచ్చిన , మాట్లాడిన ఏవిధంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈయన శుక్రవారం అసెంబ్లీ నవ్వులు పోయించాడు. ‘మెడికల్ కాలేజీలు పెట్టిన, పేదలకు సేవ చేసిన. అయినా నా మీద ఐటీ దాడులు జరుగుతాయా అధ్యక్ష?. ఐదెకరాల్లో రాజ్ భవన్ లా ఇల్లు కట్టుకున్న ఈటల, వివేక్ వెంకటస్వామిలపై ఐటీ దాడులు చెయ్యాలి’ అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.పేదలకు విద్యాదానం చేస్తున్న తనపై ఐటీ దాడి చేశారని మంత్రి ఫైర్ అయ్యారు. వివేక్ మీద.. ఈటల రాజేందర్ మీద ఐటీ దాడులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చాయ్ అమ్మినట్లు ప్రధాని పబ్లిక్ ప్రాపర్టీని అమ్ముతున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు సింగరేణిని కూడా అమ్ము నంటున్నారని మంత్రి దుయ్యబట్టారు. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, భారీ భవనాల నిర్మాణం జరగడంతో కార్మికులకు ఖాళీ టైం దొరకడం లేదన్నారు. కార్మికులకు మస్తు పనులు ఉన్నాయని చెప్పారు. పేరుకే కార్మికశాఖ కానీ నిధులకు ఢోకా లేదని.. కార్మిక శాఖలో ఫుల్ నిధులున్నాయని చెప్పుకొచ్చారు. ఇక గతేడాది నవంబర్‌ 22, 23 తేదీల్లో మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

%d bloggers like this: