ధరిపల్లిలో ఘనంగా మల్లన్న జాతర

మెదక్ జిల్లా ధరిపల్లిలో ఘనంగా మల్లన్న జాతర ప్రారంభమైంది. యాదవుల సంఘం ఆధ్వర్యంలో ఈ జాతర మూడు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలు యాదవుల కులదైవంగా భావించే మల్లన్న పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.

ఈ మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గంగాదేవి పూజ, గంపలు, రెండవ రోజు మల్లన్న కళ్యాణం, మూడవ రోజు ఉత్సవాలు జరగనున్నాయి. జాతరలో భాగంగా గ్రామం కోలహాలంగా మారిందన్నారు స్థానికులు. ఇలాంటి అనవాయితీని ముందు తరాలకు అందించడమే తమ లక్ష్యమని యాదవుల కులబాంధవులు తెలిపారు. ఈ జాతరలు తెలంగాణ సంస్కృతి సంప్రాదాయాలకు నిలువుట్టద్దం. డిల్లెం బల్లెం దరువు చప్పులతో బోనాలు, గంపల ఊరేగింపు ఈ జాతరలో ప్రత్యేకత.

సేకరణ
అవుడం మహేష్

 

Leave a Reply

%d