ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయిన పళ్ల సెట్

యుఎస్‌లోని విస్కాన్సిన్‌లో 22 ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తుల్లో వెండి పూత పూసిన కట్టుడు పళ్లు చిక్కుకున్నాయి. ప్రమాదవశాత్తు వాటిని మింగడంతో అతనికి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం , అతనికి మూర్ఛ వచ్చిన సమయంలో వెండి దంతాల సెట్ ను ధరించాడు. ఆ సమయంలో కండరాలు బిగుసుకునిపోవడం వల్ల అనుకోకుండా వాటిని మింగేశాడు. ఈ ప్రమాదం తరువాత అతను తీవ్రమైన దగ్గు, గురకలతో తీవ్ర అవస్థలు పడ్డాడు. దీంతో అతన్ని వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు.

For More News Click: https://eenadunews.co.in/

అక్కడ ఎక్స్-రేలో తీసిన వైద్యులు.. అతని ఊపిరితిత్తుల వాయుమార్గంలో 4.1 సెంటీమీటర్ల దంతాలు ఇరుక్కున్నట్లు తేల్చారు. పరీక్షలు చేసిన తర్వాత, వైద్యులు ఆ దంతాలను తొలగించడానికి బ్రాంకోస్కోపీ కోసం అతన్ని తరలించారు. ఈ ప్రక్రియలో బ్రోంకోస్కోప్ అని పిలువబడే సన్నని, తేలికైన ట్యూబ్‌ను యాక్సెసరీని తొలగించడానికి వాయుమార్గంలోకి జొప్పించారు. గుర్రపుడెక్క ఆకారంలో ఉన్న దంతాల సెట్ ను పంటి ఫోర్సెప్స్ కూడా ఉపయోగించారు. చిన్నపాటి రక్తస్రావంతో వైద్యులు ఎట్టకేలకు దాన్ని బయటకు తీశారు.

Leave a Reply

%d