శాలిపేటలో ఘనంగా మార్కండేయ జయంతి

పద్మశాలి కుల దైవమైన మార్కండేయ మహర్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని శాలిపేట గ్రామ పద్మశాలి సంఘం నాయకులు. ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో ఉండాలని కుల పెద్దలు సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ అనంత పద్మ నాభ స్వామి దేవాలయంలో మార్కండేయ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండు అంబాదాస్, కిషన్, అంజయ్య, దశరథం, శ్రీనివాస్, పాండు, రాజు, సందీప్, సతీష్, పాల్గొన్నారు. పద్మనాభ స్వామి ఆలయం ఆవరణంలో నిర్వహించిన వేడకల్లో జిల్లా కార్యవర్గ సభ్యుడు గుండు కిషన్, మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు తలకొక్కుల శ్రీనివాస్, కార్యదర్శి అంబదాస్, పట్టణ అధ్యక్షుడు ఎర్రగంటి కిష్టయ్య మరియు గుండురాజు మండల పద్మశాలి కుల బాంధవులందరూ పాల్గొన్నారు.

Leave a Reply

%d