పెళ్లి తర్వాత ప్రియుడితో కలిసి చివరికి

ఆ మహిళ వివాహిత.. పెళ్లికి ముందే ఆమె ఓ వ్యక్తితో ప్రేమాయణం (Love Affair) సాగించింది.. పెళ్లి తర్వాత కూడా అతడితో అఫైర్ కొనసాగించింది.. వీలైనప్పుడల్లా అతడిని తన ఇంటికి పిలిచేది.. సోమవారం సాయంత్రం అతడికి ఫోన్ చేసి రాత్రికి రమ్మని చెప్పింది.. దీంతో ఆ వ్యక్తి రాత్రి 9 గంటలకు రహస్యంగా తన ప్రియురాలి ఇంటికి వెళ్లాడు.. అర్ధరాత్రి 2 గంటలకు నడిరోడ్డుపై అతడు విగత జీవిగా పడి ఉన్నాడు.. ఒక చేయి నరికేసి ఉంది.. రెండు కళ్లు లేవు.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ప్రతాప్‌గఢ్‌కు చెందిన అభినందన్ సింగ్ (35) అనే వ్యక్తి వివాహితుడు. ఒక బిడ్డకు తండ్రి. అతడికి అదే గ్రామానికి చెందిన సప్న అనే మహిళతో వివాహానికి పూర్వం నుంచి అఫైర్ ఉంది. సప్న కూడా వివాహిత. వేర్వేరు వ్యక్తులను వివాహాలు చేసుకున్న తర్వాత కూడా ఇద్దరూ తమ అఫైర్‌ను కొనసాగించారు (Extra Marital Affair). వీలైనప్పుడల్లా సప్న ఇంటిలోనే కలుసుకునేవారు. ఆ విషయం సప్న భర్త శంకర్ వర్మకు తెలిసింది. భార్య ప్రియుడిని చంపాలని స్కెచ్ వేశాడు. భార్య చేత ఆమె ప్రియుడికి ఫోన్ చేయించాడు. తన స్నేహితులను ఇంటికి పిలిచాడు.

భర్త చెప్పినట్టుగానే సోమవారం సాయంత్రం అభినందన్‌కు ఫోన్ చేసిన సప్న తన ఇంటికి ఆహ్వానించింది. రాత్రి 9 గంటలకు అభినందన్ అక్కడకు వెళ్లాడు. అప్పటికే అక్కడ కాపు కాసిన శంకర్ తన స్నేహతులతో కలిసి అభినందన్‌ను చితక్కొట్టాడు. అనంతరం అతడి చెయ్యి నరికేశాడు. తర్వాత అతడి రెండు కళ్లు పీకేసి రోడ్డు మీద పడేశాడు (Man killed wife`s lover). చుట్టు పక్కల వారు వచ్చి చూసే సరికి అభినందన్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సప్న, ఆమె భర్తతో సహా మొత్తం 8 మందిపై కేసు పెట్టారు.

Leave a Reply

%d bloggers like this: