రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అదనపు డైరెక్టర్ జనరల్‌గా పూర్తి అదనపు బాధ్యతలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు అప్పగించారు. కరీంనగర్ కమిషనర్ గా పని చేసిన విబి. కమలాసన్ రెడ్డిని డీజీపీ ఆఫీస్ లో సిబ్బంది విభాగం ఐజిగా బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే, రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరిని యాదాద్రి జోన్ డీఐజీగా బదిలీ చేశారు. అయితే, నల్లగొండకు ఎస్పీని నియమించే వరకూ ఆమే కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న కొందరికి పోస్టింగ్ ఇచ్చింది. కొంతమందికి అదనపు బాధ్యతలు అప్పగించింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 29 మంది అధికారులను బదిలీ చేసింది. డీజీపీ కార్యాలయంలో సంస్థాగత వ్యవహారాల ఏడీజీ రాజీవ్ రతన్‌ను పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేశారు. రాజీవ్ రతన్ స్థానంలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఏడీజీ కొత్తకోట శ్రీనివాస రెడ్డిని నియమించారు. రైల్వే, రోడ్ సేఫ్టీ ఏడీజీగా ఉన్న సందీప్ శాండిల్యను పోలీసు అకాడమీ డైరెక్టరుగా నియమించారు. డీజీపీ కార్యాలయంలో ఏడీజీ (పర్సనల్)గా ఉన్న బి.శివధర్ రెడ్డిని రైల్వే, రోడ్ సేఫ్టీ ఏడీజీగా బదిలీ చేశారు. టీఎ్‌సఎ్‌సపీ బెటాలియన్స్ ఏడీజీ అభిలాష బిస్త్‌ను డీజీపీ కార్యాలయంలో సంక్షేమం, క్రీడల ఏడీజీగా బదిలీ చేశారు. ఆమెకే హోం గార్డ్స్ ఏడీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డైరెక్టరుగా ఉన్న శిఖా గోయల్‌ను షీ టీములు, భరోసా, మహిళా భద్రత విభాగాలకు ఏడీజీగా బదిలీ చేశారు. ఇప్పటి వరకూ ఈ బాధ్యతలు నిర్వహించిన స్వాతి లక్రాను టీఎ్‌సఎస్పీ బెటాలియన్స్ ఏడీజీగా బదిలీ చేశారు. టీఎ్‌సఎల్పీఆర్బీ చైర్మన్‌గా ఉన్న వీవీ శ్రీనివాసరావుకు పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకూ వెయిటింగ్‌లో ఉన్న విజయ్ కుమార్‌కు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఏడీజీగా బాధ్యతలు అప్పగించారు. నార్త్ జోన్ ఏడీజీగా వై.నాగిరెడ్డిని విపత్తు నిర్వహణ, అగ్ని మాపక సేవల డీజీగా బదిలీ చేశారు.
ఐజీగా విబి కమలాసన్ రెడ్డి
