దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బస్సులోని అమ్మాయిని చూస్తూ ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో ఈ ఘటన జరిగింది. అమ్మాయిని చూస్తూ యువకుడు చేస్తున్న పాడుపని హస్తప్రయోగం (Masturbates)ని చిత్రీకరించిన బస్సు సిబ్బంది ఒకరు దానిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
అయితే, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. బస్సెక్కిన యువకుడు యువతిని చూస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. అది చూసిన యువతి వెంటనే అప్రమత్తమై బస్సులోని మార్షల్ సందీప్ చకరకు చెప్పింది. నిందితుడిని ఆయన అదుపులోకి తీసుకున్నాడు.
మార్షల్ పట్టుకోగానే యువకుడు ఒక్కసారిగా ఏడ్చేశాడు. నిందితుడిని బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఫిర్యాదు అందకపోవడంతో అతడిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. దర్యాప్తునకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ ఘటనపై వాంగ్మూలం ఇచ్చేందుకు కానీ, ఫిర్యాదు చేసేందుకు కానీ యువతి నిరాకరించినట్టు పోలీసులు తెలిపారు.