మెదక్ కమలం పార్టీలో కల్లోలం

 బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇటీవల సొంత పార్టీ తీరుపై చేసిన విమర్శలు, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను నిరాశపరిచేలా ఉన్నాయన్న వ్యాఖ్యలు స్థానికంగా వ్యక్తమవయ్యాయి. ఈ క్రమంలో రఘునందన్‌కు వ్యతిరేకంగా పార్టీలోని నేతలు ఏకమయ్యారు. ‘రఘునందన్‌ కో హఠావో.. బీజేపీకో బచావో’ అనే నినాదంతో కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. బుధవారం నేతలు గిరీశ్‌ రెడ్డి, సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు చెందిన ముఖ్యనాయకులతో సమాలోచనలు చేపట్టారు. దుబ్బాక ఉప ఎన్నికలో తెలంగాణ నలుమూల నుంచీ క్యాడర్‌ అంతా కలిసివచ్చి, కష్టపడ్డారని.. అలాంటిది, తన మొహం చూసే ఓట్లేశారని రఘునందన్‌ చెప్పుకోవడం దారుణమని పేర్కొన్నారు. కరీంనగర్‌ నుంచి కార్పొరేటర్‌ ఉమా లాంటి వాళ్లను గ్రామాల్లోకి పంపి, ఇంటింటా ప్రచారానికి బండి సంజయ్‌ పురమాయిస్తే, ఆయనపైనా రఘునందన్‌ కామెంట్లు చేశారని మండిపడ్డారు.

ఉప ఎన్నికలో విజయం కోసం అటుకులు తిని, పస్తులుండి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. ఉప ఎన్నికలో గెలుపు క్రెడిట్‌ రఘునందన్‌దే అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్‌ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పార్టీని కించపరుస్తూ మాట్లాడిన రఘునందన్‌రావుపై చర్యలు తీసుకోవాలని, కోవర్టు రాజకీయాల నుంచి బీజేపీని రక్షించాలనీ గిరీశ్‌ రెడ్డి తీర్మానం చేశారు. వీరంతా కలిసి కార్యాచరణ రూపొందించి, అధిష్ఠానాన్ని కలవనున్నారు. మాజీ ఎమ్మెల్యే వాసురెడ్డి ఆరోగ్య రీత్యా ఈ సమావేశానికి రాలేకపోయారు. నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ను కలిసి, తమ గోడును వినిపించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఇప్పుడు ఆయనే గీతదాటారని ఆగ్రహం

గతంలో సమావేశాలు నిర్వహించిన తమపై చర్యలు తీసుకోవాలంటూ అధిష్ఠానానికి రఘునందన్‌ ఫిర్యాదు చేశారని, ఇప్పుడు ఆయనే గీతదాటి.. ఏకంగా అమిత్‌షా, నడ్డాలపై వ్యాఖ్యలు చేశారని నేతలు మండిపడుతున్నారు. తాము కోవర్టు రాజకీయాలు మంచివి కావని మాత్రమే చెప్పామని, ఆయనలాగే తమకూ గుర్తింపు కావాలనీ కోరామని వారు వాపోయారు. పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు తాము జెండాలు మోశామని, పార్టీ కోసం ఏబీవీపీ, సంఘ్‌పరివార్‌ నుంచి వచ్చి, జీవితాంతం పార్టీ కోసం పనిచేశామని, తమకు పదవి కావాలమని అడగటంలో తప్పేమున్నదని వారు ప్రశ్నిస్తున్నారు. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని కీలక నేతలకు పదవులు ఇస్తే, తన పదవికి రాజీనామా చేస్తాని రఘునందన్‌ హెచ్చరిస్తూ అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉప ఎన్నికలో విజయం కోసం అటుకులు తిని, పస్తులుండి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. ఉప ఎన్నికలో గెలుపు క్రెడిట్‌ రఘునందన్‌దే అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్‌ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పార్టీని కించపరుస్తూ మాట్లాడిన రఘునందన్‌రావుపై చర్యలు తీసుకోవాలని, కోవర్టు రాజకీయాల నుంచి బీజేపీని రక్షించాలనీ గిరీశ్‌ రెడ్డి తీర్మానం చేశారు. వీరంతా కలిసి కార్యాచరణ రూపొందించి, అధిష్ఠానాన్ని కలవనున్నారు. మాజీ ఎమ్మెల్యే వాసురెడ్డి ఆరోగ్య రీత్యా ఈ సమావేశానికి రాలేకపోయారు. నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ను కలిసి, తమ గోడును వినిపించాలని సమావేశంలో నిర్ణయించారు.

దుబ్బాక నియోజకవర్గంలో గతంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్న గిరీశ్‌ రెడ్డి, సంజీవరెడ్డికి ప్రాధాన్యం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పార్టీ నియామకాలల్లో తమకు రఘునందన్‌ అన్యాయం చేశారని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని ముఖ్య కార్యకర్తలందరినీ అణిచివేసే ధోరణితో ఇన్నాళ్లు వ్యవహరించారని ఆసంతృప్తిని వ్యక్తం చేశారు. సీనియర్‌ నాయకులు విద్యాసాగర్‌, ఆకుల రాజయ్యకు రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం రాకుండా అడ్డుకున్నారని వాపోతున్నారు. ఆకుల రాజయ్య, పటన్‌చెరులోని రూ.4 కోట్ల విలువైన స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం అప్పగించారని గుర్తు చేస్తున్నారు. ఆయన మెదక్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి, ఆర్థికంగా నష్టపోయారన్నారు. కరసేవకుడిగా పనిచేసిన రాంచరణ్‌యాదవ్‌ను రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం రాకుండా చూస్తున్నారని ఆరోపించారు. పటన్‌చెరులో నందీశ్వర్‌గౌడ్‌కు వ్యతిరేకంగా గ్రూపులు కట్టి, పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. పార్టీలో కీలకంగా పనిచేసిన వారిని పక్కన పెట్టిన రఘునందన్‌రావు తనకు పదవులు రాలేదనే ఆవేదన వ్యక్తం చేయడం సిగ్గుచేటన్నారు. కరసేవకులను సన్మానించాలనే జాతీయపార్టీ పిలుపును బేఖాతారు చేస్తూ, దుబ్బాక నియోజకవర్గంలో 40 మంది కరసేవకులున్నా, వారిని కనీసం పిలిచిన పాపాన పోలేదన్నారు.

Leave a Reply

%d