అప్పుల బాధతో యువరైతు మృతి

అప్పుల బాధతో యువ రైతు మృతి చెందండంతో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం ధరిపల్లి గ్రామంలో సల్ల కుమార్ తనకున్న వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేస్తూ… మరోవైపు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఉద్యోగం మానేసి… పూర్తి సమయం వ్యవసాయానికి కేటాయించాడు. అలాగే వ్యవసాయానికి పెట్టుబడి, పెళ్లిలకు భారీగా డబ్బు ఖర్చవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో గత నెల చివరి రోజున వ్యవసాయ పొలం వద్ద గడ్డి మందు తాగి కుటుంబ సభ్యలకు ఫోన్ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న వారు సమీపంలోని నార్సింగిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న తరుణంలో మృతి చెందాడు.

Leave a Reply

%d