పంటలను పరిశీలించిన పద్మాదేవేందర్ రెడ్డి

ఈదురు గాలులతో పాటు వడగళ్ల వానతో దెబ్బతిన్న వరి పంటలను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి బుధవారం పరిశీలించారు. హవేలీ ఘనాపూర్ మండలం కూచన్ పల్లిలో అకాల వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి బాధిత రైతులను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి భరోసానిచ్చారు.

పంట కోసే సమయానికి అకాల వర్షం వలన పంట నష్టం జరిగిందన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అందర్నీ ఆదుకుంటుందని చెప్పారు. మెదక్ నియోజకవర్గంలో సాయంత్రం వరకు ఎంత నష్టం వచ్చిందని అధికారుల ద్వారా రిపోర్టు తీసుకుని ముఖ్యమంత్రి, మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. తక్షణ సహాయం కింద ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పంట నష్ట పరిహారం అందజేస్తారన్నారు. అనంతరం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన కాలిపోయిన ఇండ్లను పరిశీలించారు. ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం నుండి అన్ని విధాల ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు.

For More News clink the link: https://eenadunews.co.in/

ఎమ్మెల్యే వెంట మెదక్ ఆర్డిఓ సాయిరాం, ఎమ్మార్వో నవీన్ కుమార్, కుచన్ పల్లి సర్పంచ్ దేవా గౌడ్,జిల్లా రైతుబంధు అధ్యక్షులు సోములు, హవేళిఘనాపూర్ పార్టీ అధ్యక్షులు సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి,మెదక్ ఆత్మ కమిటీ చైర్మన్ అంజ గౌడ్, ఫరీద్ పుర్ ఎంపిటిసి.రాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాప. సాయిలు, తొగిట సర్పంచ్ శ్రీహరి,బిఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శి పడాల సతీష్,నాయకులు కొంపల్లి సుభాష్ రెడ్డి, కిష్టా గౌడ్, యాదగిరి,నవీన్,గ్రామ రైతులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

%d