ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి తూప్రాన్ బిడ్డ గద్దర్

దశాబ్దాల పాటు విప్లవ రాజకీయాల్లో ఆట పాటలతో తెలంగాణ ప్రజలను ఉర్రూతలు ఊగించి ఎంతోమంది యువతను విప్లవ రాజకీయాల వైపు విప్లవ పార్టీలవైపు ఆకర్షించిన గద్దర్ (Gaddar) బుల్లెట్ వైపు నుండి బ్యాలెట్ వైపు వస్తున్నారు.విప్లవ రాజకీయాల్లో సంచలనం సృష్టించి తూఫాన్ రేపిన తూప్రాన్ బిడ్డ ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో కి అడుగు పెట్టనున్నారు. ఈ మేరకు తాను తూప్రాన్ లోనే నివాసం ఉంటాను తనకు రక్షణ కల్పించాలని కోరుతూ బుధవారం తూప్రాన్ పోలీస్ లకు గద్దర్ వినతి పత్రం సమర్పించారు. దీంతో గద్దర్ గజ్వేల్ నియోజకవర్గం లోనే పోటీ చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది.

రాజకీయ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నానంటు ప్రకటించిన ప్రజాయుద్దనౌక గద్దర్. ఎన్నిక‌ల‌నే టార్గేట్‌గా పెట్టుకున్నారా ఆయన పొలిటికల్ ఎంట్రి ఎక్కడ నుండి ఉండబోతుంది. 2023లో గద్దర్ ఏ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వ‌స్తాన‌ని గ‌ద్ద‌ర చెప్ప‌క‌నే చెప్పారు. తన ఆట పాట లతో ప్రజలను చైతన్య పరిచిన గద్దర్ ఎన్నికలకు సిద్దమంటు ప్రకటించారు. అయితే ఎక్కడ నుండి పోటి చేస్తారనేది మాత్రం అప్పుడు చెప్పలేదు ఓ వైపు ముందస్తు సంకేతాలు మరోవైపు అన్ని పార్టీలు అభ్యర్దులను ఫైనల్ చేసుకుంటున్న ఈ తరుణంలో గద్దర్ కూడా తన పొలిటికల్ ఎంట్రీ పై సీరియస్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. త‌న సొంత జీవితాన్ని గ‌జ్వేల్ నియోజకవర్గం నుండి ఆయన కేసీఆర్ పై పోటీ చేస్తారనే సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

దీనికి తోడు మెదక్ జిల్లా తూప్రాన్‌లో మంగ‌ళ‌వారం పోలీసులను కలిసిన గద్దర్ తనకు రక్షణ కల్పించాలని కోరారు. తన వయసు 76 సంవత్సరాలని, కాబట్టి ఇక నుంచి పుట్టిన ఊళ్లోనే జీవించాలని అనుకుంటున్నట్టు మనసులో మాటను బయటపెట్టారు. రానున్న ఎన్నికలతో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్లు గ‌ద్ద‌ర్ తెల‌ప‌డం మ‌రో విశేషం.

ప్ర‌భుత్వ విధానాల‌పై విమ‌ర్శ‌లు

తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని అందరూ భావిస్తే కేసీఆర్‌ పాలనలో ప్రజలకు కన్నీళ్లు మిగిలాయని గద్దర్ విమర్శలు గుప్పించారు. ఎంతో మంది అమరుల ఆత్మ బలిదానాలతో, తెలంగాణ ప్రజలు చిందించిన రక్తంతో గద్దెనెక్కిన కేసీఆర్ ను గద్దె దించేలా యువత దీక్ష తీసుకోవాలని గద్దర్ పిలుపునిచ్చారు. కేసీఆర్‌ కు ఓటుతో సమాధానం చెప్పాలని ఆయన పేర్కొన్నారు.

నిన్న మొన్నటి వరకు మంత్రులు ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. ఇప్పుడు మంత్రులందరూ మన ముందే ఉంటారని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత లైబ్రరీలలో వాడిపోయిన మొహాలతో ఎదురుచూస్తున్నారని గద్దర్ పేర్కొన్నారు. ఇలా ఎక్క‌డ ప్ర‌భుత్వ విధానాల‌పై కార్య‌క్ర‌మాలు జ‌రిగిన పాల్గొంటూ ప్ర‌భుత్వం గ‌ద్ద‌ర్(Gaddar) విమ‌ర్శ‌లు చేస్తూ ఉన్నారు.

కేసీఆర్‌పై పోటీకి సిద్ధం

ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై పోటీ చేయబోతున్నట్టు తెలిపారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లో మంగ‌ళ‌వారం పోలీసులను కలిసిన గద్దర్ తనకు రక్షణ కల్పించాలని కోరారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తన వయసు 76 సంవత్సరాలని, కాబట్టి ఇక నుంచి పుట్టిన ఊళ్లోనే జీవించాలని అనుకుంటున్నట్టు మనసులో మాటను బయటపెట్టారు. తమ గ్రామంపై ‘మై విలేజ్ ఆఫ్ ది 60 ఇయర్స్’ పేరుతో పుస్తకం రాసినట్టు గద్దర్ తెలిపారు. రానున్న ఎన్నికలతో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్టు వివరించారు.

Leave a Reply

%d