హైదరాబాద్ లో కాల్పుల కలకలం

హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి కాలుపుల కలకలం రేగింది. మూడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రిలోని వైన్ షాప్ వద్ద గుర్తు తెలియని దుండగులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.

అనంతరం వైన్స్ సిబ్బందిని బెదిరించి రూ. రెండు లక్షలు ఎత్తుకెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనకు కారణమైన నిందితులను గాలించే పనిలో పడ్డారు పోలీసులు. కాగా ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

%d