సరైన సమయానికి – సరైన వైద్యం అందించాలి

డాక్టర్: అమర్ నాథ్
కన్సల్టెంట్ ఎమర్జెన్సీ మెడిసిన్
కిమ్స్ సవీర, అనంతపురం.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని వీలైనంత త్వరగా ఎమర్జెన్సీ గదికి తీసుకవెళ్ళగలిగితే అతడి ప్రాణాలు కాపాడగలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
ప్రాణాపాయ స్థితిని ఎలా గుర్తించాలి
ఛాతిని పట్టుకొని ఒక్కసారిగా మనిషి కుప్పకూలిపోవడం, సఈహ కోల్పోవడం, ఛాతి నొప్పి ఆయాసం, ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం, ఒక పక్క కాలు, చేయి పనిచేయకపోవడం, ఒక్కసారిగా మాట పడిపోవడం, పాము కాటు, విషం తాగడం, జ్వరం, తీవ్రమైన విరేచనాలు, వింతంగా ప్రవర్తించడం, మూర్ఛపోవడం, రోడ్డు ప్రమదాదాలు, తలకు, ఛాతికి, పొట్టకి బలమైన గాయాలు కావడం వంటివి మనిషిని అత్యవసరంగా చికిత్స అందించే సమయాలు.

మొదటగా మనం చేయాల్సింది ఏమిటి ?
మొదటగా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ నెంబర్ 108కి ఫోన్ చేయాలి. అత్యవసర చికిత్స అనేది ప్రమాద స్థలం నుంచే ప్రారంభించాలి.
పూర్తి అపస్మారక స్థితిలో ఉన్న మనిషికి నాడీ/పల్స్ రేట్ లేని వారికి సీపీఆర్ అంటే ఛాతిపై 30 సార్లు మర్థన చేయాలి.
2 సార్లు నోటి నుంచి నోటి ద్వారా లేదా ఎఎంబియు మాస్క్ ద్వారా శ్వాసను అందించాలి. వీలైనంత త్వరగా అత్యవసర విభానాకి తీసుకరావాలి.
సరైన సమయంలో తీసుకవెళ్తే.. సరైన చికిత్స అందించడం ద్వారా వ్యక్తిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపడవచ్చు.

Leave a Reply

%d