ఆ హీరోయిన్ పెట్టిన ఫోటోలకు ట్రోలింగ్

ఏదైన చిన్న అంశం దొరికితే చాలు… ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టేస్తున్నారు. ఇక సినిమా రంగంలోని వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కడైన సరదాగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడితే చాలు…. ఫ్యాన్స్ ఒక ఆట ఆడేస్తారు. ఆ ట్రోల్సలో చిక్కుకున్నది వర్థమాన తార మీనాక్షిచౌదరి.  మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మీనాక్షి చౌదరి.. ఈ పొడుగుకాళ్ల సుందరికి తెలుగు నాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. యంగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో ఆమె చెరగని స్థానం సంపాదించుకున్నారు. స్టన్నింగ్స్​ లుక్స్​తో అందర్నీ కట్టిపడేస్తుంటారామె. మోడల్​గా కెరీర్ మొదలుపెట్టిన మీనాక్షి చౌదరి.. అక్కడ తన మార్క్ చాటారు. ఆ తర్వాత సినీ అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ‘ఇచట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇందులో సుశాంత్ సరసన చక్కగా నటించి ఆమె ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత బిగ్ ఛాన్స్ కొట్టేశారు మీనాక్షి. ఏకంగా మాస్ మహారాజా రవితేజ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. రవితేజ పక్కన ‘ఖిలాడీ’ మూవీలో నటించారు. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీలో అందాల విందు చేశారామె. దీంతో స్టార్ హీరో అడివి శేష్​ సరసన ‘హిట్ 2’లో నటించే ఛాన్స్​ను సంపాదించారు మీనాక్షి. ఈ మూవీ మంచి హిట్ సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ జానర్​లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. అయినా మీనాక్షీకి సరైన అవకాశాలు రాలేదు. ఆమెకు ఉన్న గ్లామర్​కు పక్కా స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నా ఎందుకో అవకాశాల వేటలో ఆమె వెనుకపడుతున్నారు. రవితేజ, శేష్ లాంటి వాళ్ల పక్కన నటించినా అనుకున్నంత క్రేజ్ రాలేదని మీనాక్షి ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

అందానికి అందం, మంచి ఫిజిక్, ఎత్తుగా ఉన్నప్పటికీ మీనాక్షీని తమ సినిమాల్లో తీసుకునేందుకు ఎందుకో స్టార్ హీరోలు ఆసక్తి చూపడం లేదు. అయితే ఆమె మాత్రం ప్రయత్నాలు ఆపడం లేదు. సోషల్ మీడియాలో మీనాక్షి తెగ రచ్చ చేస్తున్నారు. వేడెక్కించే అందాలతో గ్లామర్ జాతరకు తెరలేపారు. అయితే దీనిపై నెటిజన్స్ మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు. బిగుతైన టీషర్ట్​లో పరువాల షేపులు కనిపించేలా రెచ్చగొట్టేందుకే ఫోజులు ఇస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తం బాడీని స్లిమ్​గా మెయింటెయిన్ చేస్తూ, ఎద అందాలను మాత్రం చూపిస్తున్నారని నెటిజన్స్ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె షేపులకు లవ్​లో పడిపోతున్నామని అంటున్నారు.

Leave a Reply

%d bloggers like this: