పని మనిషి కావాలి జీతం 2 కోట్ల

చైనా దేశానికి షాంఘై సిటీకి చెందిన ఓ మహిళ ఇచ్చిన బహిరంగ ప్రకటన ఇప్పుడు ప్రపంచంలో సంచలనగా మారిపోయింది. ఏకంగా రూ.2 కోట్లకు తగ్గట్లు ఆమె చెప్పిన పనులు లీస్ట్ చూసి ఔరా అని అనుకుంటున్నారు.  ఇంతకీ ఆ మహిళ ఇచ్చిన ప్రకటన లో ఎముందంటే..  తన ఇంట్లో ఎవరైతే పనికి కుదురుతారో..  24 గంటలు ఇంట్లో ఉండాలి. ఉదయం ఐదు గంటలకే నిద్ర నుంచి లేపాలి. వెంటనే వాటర్, టీ, కాఫీ ఇవ్వాలి. ఆ తర్వాత బాత్రూంలో అన్నీ రెడీ చేసి పెట్టాలి. ఓనర్ షెడ్యూల్ అంతా తెలుసుకొని దానికి కావల్సినవన్నీ వస్తువులు, ఆమె ధరించుకొనే దుస్తులు అన్నీ రెడీ చేసి పెట్టాలి.  చక్కగా టిఫిన్ రెడీ చేయాలి. టేస్ట్ లో ఏ మాత్రం తేడా ఉండకూడదు. బయటకు ఆమె వెళ్తున్నప్పుడు గేట్ తీసి పెట్టాలి. ఆ తర్వాత సాయంత్రానికి స్నాక్స్ రెడి చేయాలి. ఇంకా ఏమిటంటే ఇంటిని అంతా శుభ్రం చేయాలి.దుమ్ము ధూళి అసలు ఉండకూడదు. ఆమె లంచ్ కి వచ్చేముందు మెసేజ్ చేస్తుంది. కనుక గేట్ తీసి పెట్టి, లంచ్ రెడి చేసి,అది అయిపోయ్యాక, రెస్ట్ తీసుకోవటానికి ఏర్పాట్లన్నీ చేయాలి. ఆ తర్వాత సాయంత్రానికి స్నాక్స్, రాత్రికి డిన్నర్ ముందే ప్రిపేర్ చెయ్యాలి.ఇంకా మధ్యలో ఏమైనా ఆహారం అడిగితే వెంటనే చేసి ఇవ్వాలి.24 గంటలు అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి.

For More News Click: https://eenadunews.co.in/

తన ఇంట్లో  పనిమనిషి చాలా శుభ్రంగా ఉండాలి. అలాగే డ్రెస్ సెన్స్ మెయింటెన్ చేయాలి. స్టార్ హూటల్ లో ఉండే వారిలో మంచి డ్రెస్సింగ్.. నీట్ గా ఉంటూ..  ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. తన వద్ద పనిచేసేవారు చాలా బాగా ఓపికతో ఉండాలి. ఇంకా 165 సెంటీమీటర్లు ఉండాలి, 55 కేజీల బరువు మాత్రమే ఉండాలి. అక్కడ చైనా లో విద్యాఅర్హత కు 12 వ తరగతి అయిపోయిండాలి.చైనా భాష వచ్చి ఉండాలి.ఇంకా చదవటం, రాయడం దానితో పాటు అన్నీ తెలిసి ఉండాలి. ఇలా ఉండాలి అనుకుంటే ఇందుకు తగ్గట్టుగా జీతం వస్తుంది. నెలకు రూ.16 లక్షల చొప్పున సంవత్సరంలో రెండు కోట్ల రూపాయలు ఇస్తానంటూ ప్రకటన విడుదల చేసింది. ఆ మహిళ.. అయితే అక్కడ పని చేయాలంటే ఇవన్నీ ఉండాలి కదా. అవును కానీ అసలు పని మనిషి దొరికిందా లేదా అని డౌట్ గా ఉన్నార. ప్రస్తుతం అయితే దొరకలేదు. ఆమె ఇచ్చిన ప్రకటన మాత్రం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిపోయింది. పని మనుషులు అంటున్నారట ఇంటర్వ్యూ చాలా వేరైటీగా ఉందని అవాక్కయ్యారు.

Leave a Reply

%d