కిమ్స్ హాస్పిటల్లో కేటీఆర్, పువ్వాడ అజయ్

హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న పువ్వాడ నాగేశ్వ‌ర్ రావును మంత్రి కేటీఆర్ పరామర్శించారు. గత రెండు వారాలుగా అస్వస్థతకు గురై హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో నాగేశ్వ‌ర రావు చికిత్స పొందుతున్నారు. విష‌యం తెలుసుకున్న మంత్రి కేటీఆర్  ఆయ‌న్ను ప‌రామ‌ర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి కేటీఆర్ ని చూసి పువ్వాడ నాగేశ్వరరావు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న చికిత్స వివరాలను మంత్రి కేటీఆర్ కి వైద్యులు క్షుణ్ణంగా వివరించారు. కేటీఆర్ వెంట నాగేశ్వ‌ర్ రావు కుమారుడు, మంత్రి పువ్వాడ అజ‌య్ ఉన్నారు.

Leave a Reply

%d