డీజే టిల్లుతో మంత్రి మల్లారెడ్డి స్టెప్పులు

ఎక్కడ ఉన్నా.. వేదిక ఏదైనా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసే సందడే వేరు. తాజాగా ఓ మాస్ సాంగ్ కి తనదైన స్టైల్లో స్టెప్పులేసి అందర్నీ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా హైదరాబాద్ మాల్లారెడ్డి యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మంత్రి మల్లారెడ్డి నిర్వహించిన ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డను ఆహ్వానించారు. ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన సిద్ధు స్టూడెంట్స్ తో సరదాగా మాట్లాడారు. అనంతరం స్టేజ్ పై మంత్రితో కలిసి స్టెప్పులు కూడా వేశారు. డీజే టిల్లు సినిమాలో టైటిల్ సాంగ్ కి హీరో సిద్ధుతో కలిసి మల్లారెడ్డి స్టెప్పులు వేశారు. దీంతో కాసేపు అక్కడున్న వాతావరణం అంతా సందడిగా మారింది. మంత్రి, హీరోతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Leave a Reply

%d