వైకాపాపై ఆనం సంచలన వ్యాఖ్యలు

ఏపీలోని వైకాపా ఎమ్మెల్యే తమ సొంత పార్టీపై సంచనల వ్యాఖ్యలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా రాపూరులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఆనం వైకాపా ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యాలు చేశారు. ఏం చేశామని ప్రజలను ఓట్లు అడగాలని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కట్టామా ?, పనులు మొదలు పెట్టామా ? తాగు నీరు ఇచ్చామా ? కనీసం రోడ్లలోని గుంతలను పూడ్చామా ?…. కేవలం ఫించన్లు ఇస్తే ఓట్లు వస్తాయా అని ప్రసగించారు. ఇల్లు కడుతామని లే అవుట్లు వేసినా కట్టలేకపోయామని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎస్ ఎస్ కెనాల్ కడుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం. కానీ ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. అసెంబ్లీలో అడిగినా… ప్రభుత్వ అధికారులను, ఇంజనీర్ల సమావేశం, చివరికి సీఎం జగన్ వద్దకు తీసుకవెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే రాజకీయాలు చేయడం కష్టమేనన్నారు. వైఎస్సార్ కలలుగన్న రాజ్యం తీసుకరావడంలో విఫలమయ్యాం అన్నారు. ఇప్పుడు ప్రజలు తనని నమ్మె పరిస్థితిలో లేరన్నారు.

Leave a Reply

%d