నేను కూడా రాజకీయాల్లో ఉన్నా…

తెలంగాణ రాష్ట్ర సాధాన కోసం ప్రతి ఒక్కరూ పోరాడినవారే. తెలంగాణ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన పార్టీ తెరాస. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. జాగృతి పేరుతో కవిత కూడా రాజకీయం చేసింది.  2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ తెలంగాణ రాజకీయ సమితిగా మారిపోయింది. ఇది సాక్షాత్తూ… ఆ పార్టీ అధినేత కొడుకు, కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఆ తరువాత ఆ ఇంటి వారే పాలిస్తున్నారు. కానీ ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంతో పీకల్లోత్తు ఇబ్బందులో పడింది సీఎం కూతురు కవిత. ఈ స్కీం తెరమీదకు రాక ముందు మాత్రం కవిత ప్రజల్లో ఎక్కడా కనిపించలేదు. ఇక పార్టీ కార్యక్రమంలో అక్కడక్కడ కనిపించిన పెద్దగా ప్రజలతో మమోకం కాలేదు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఈ కోవలో ఢిల్లీ లిక్కర్ స్కాం వచ్చిందని రాజకీయ ప్రముఖులు అంటున్నారు.

అయితే ఇటీవల ఈడీ నోటీసులు ఇవ్వడం, విచారణ జరపడం జరిగింది. ఇప్పటి వరకు పెద్దగా కనిపించని కవిత ప్రజల్లోకి రావడం మొదలు పెట్టింది. జాగృతి పేరుతో సొంత డబ్బా కొట్టుకున్న ఆమె ఆ కుంపటి సంవత్సరాలుగా కనిపించలేదు. ఈడీ విచారణ తరువాత జాగృతి పేరుతో సమావేశం ఏర్పాటు చేసింది. కేసీఆర్ భారస ప్రకటించగానే జాగృతి కూడా దేశ వ్యాప్తంగా చేయాలని గతంలోనే నమోదు చేసినట్లు వెల్లడించింది. ఇక అడపదడప సమావేశాలు పెట్టి తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నట్టు  కవరింగ్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన కూడా కవిత వెళ్లింది అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్క స్కాం ఎంత పెద్ద ఇబ్బందులను తెచ్చిపెట్టిందోనని.

Leave a Reply

%d bloggers like this: