మూడోసారి విచారణ కవిత అరెస్ట్ తప్పదా ?

ప్రస్తుతం తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ ను(BRS) డిల్లీ లిక్కర్ స్కామ్ వేధిస్తోంది.ఈ కేసులో సి‌ఎం కే‌సి‌ఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితా(Mlc Kavitha) ఇప్పటికే రెండు సార్లు ఈడీ విచారణను కూడా ఎదుర్కొంది .

కాగా కవితా కచ్చితంగా అరెస్ట్ అవుతుందని కమలనాథులు గట్టిగా ఆరోపిస్తున్నారు.మరోవైపు మోడి సర్కార్ కక్ష పూరితంగానే తమను టార్గెట్ చేస్తోందని బి‌ఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.

ఇంత హాట్ హాట్ గా సాగుతున్న తెలంగాణ పాలిటిక్స్ లో తాజాగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని రాజేస్తున్నాయి.ప్రస్తుతం ఈడీ, సిబిఐ వంటి సంస్థల ద్వారా ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు కచ్చితంగా అరెస్ట్ అవుతారని అమిత్ షా ఇటీవల హైదరబాద్ వచ్చిన సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ పైన అలాగే, మోడీ పైన వ్యతిరేక ప్రచారం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తారని, అలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలని అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది.అమిత్ షా చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే కవితా అరెస్ట్ ఖాయమనే సంకేతాలను ఇచ్చిటట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని చూస్తున్న కాషాయపార్టీ బలంపెంచుకోవడం మాత్రమే కాకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న బి‌ఆర్‌ఎస్ ను కూడా బలహీన పరిచేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.అందుకే బి‌ఆర్‌ఎస్ దూకుడుకు అడ్డుకట్టే వేసే ఏ చిన్న ప్రయత్నాన్ని కూడా వదలడం లేదు మోడీ సర్కార్. ప్రస్తుతం సంచలనంగా మారిన డిల్లీ లిక్కర్ స్కామ్ తో బి‌ఆర్‌ఎస్ ను డిఫెన్స్ లోకి పడిసింది మోడీ సర్కార్.వచ్చే ఎన్నికల ప్రచారంలో కూడా డిల్లీ లిక్కర్ స్కామ్ ను ప్రధాన ఎన్నికల అస్త్రంగా ఉప్పయోగించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి డిల్లీ లిక్కర్ స్కామ్ తో(Delhi Liquor Scam) ఒక్కసారిగా బి‌ఆర్‌ఎస్ ను డిఫెన్స్ లోకి నెట్టి మెయిన్ లైమ్ లోకి వచ్చిన బీజేపీ.ముందు రోజుల్లో మరిన్ని బి‌ఆర్‌ఎస్ పై ఇంకెలాంటి అస్త్రాలను వదులుతుందో ? అనే ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తమౌతున్నాయి.

అయితే కే‌సి‌ఆర్ వ్యూహాలను కూడా ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి లేదు.మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారాన్ని కే‌సి‌ఆర్ ఎలా తిప్పికొట్టారో బీజేపీ అధిష్టానానికి బాగా తెలుసు.అందుకే ప్రస్తుతం కే‌సి‌ఆర్ కూతురు కవితా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండడంతో.తరువాత కే‌సి‌ఆర్ రచించే వ్యూహాలు ఎదుర్కొనేందుకు రాష్ట్ర నేతలు సిద్దంగా ఉండాలని అమిత్ షా కాస్త గట్టిగానే హెచ్చరించరాట. మరి ఈనెల 16న ఎమ్మెల్సీ కవిత మరోసారి ఈడీ విచారణను ఎదుర్కొనున్న నేపథ్యంలో తరువాత జరిగే పరిణామాలపై అందరి దృష్టి నెలకొంది.మరి ఏం జరుగుతుందో చూడాలి.

Leave a Reply

%d