నేను సుప్రీం కోర్టుకు పోలేదు – కవిత

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మరోసారి తాను పిటిషన్‌ దాఖలు చేశారని.. దాన్ని న్యాయస్థానం తిరస్కరించిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గురువారం నాడు మాత్రమే తాను సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశానని.. ఇవాళ ఎలాంటి పిటిషన్‌ వేయలేదని స్పష్టం చేశారు. మహిళగా తనకు ఉన్న హక్కులను, వ్యక్తిగత గోప్యతను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ( ఈడీ ) హరిస్తున్నదని, వాటిని కాపాడాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్‌ వేశారు.

 

ఈ పిటిషన్‌ను 24న విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఇదిలా ఉంటే ఈ నెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో 20వ తేదీలోపే తన పిటిషన్‌పై విచారణ జరపాలని మరోసారి సుప్రీంకోర్టును అర్థించిందని.. దీన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిందని ఓ ప్రముఖ పత్రికలో వార్తాకథనం వచ్చింది. తనపై తప్పుడు కథనాలు రావడంతో ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌ ఈ నెల 24న విచారణకు వస్తుందని.. ఈ రోజు ఎలాంటి పిటిషన్‌ దాఖలు చేయలేదని స్పష్టం చేసింది.

Leave a Reply

%d