ఇవాళ మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లనున్న కవిత ఎందుకంటే ?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..సుప్రీంకోర్టులో మార్చి 17వ తేదీన మరోసారి పిటిషన్ వేయనున్నారు. తన పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.  ఈ నెల 20నే  విచారణకు రావాలని ఈడీ స్పష్టం చేసిన నేపథ్యంలో కవిత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే  ఈ     పిటిషన్ పై మార్చి24న  విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ కవిత పిటిషన్ ను  మార్చి 17న సుప్రీం విచారిస్తే ఆమెను ఈడీ విచారించడంపై స్పష్టత రానుంది.  ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత.. మార్చి 16వ తేదీన ఈడీ విచారణకు హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోతున్నానని.. మీరు అడిగిన ప్రశ్నలకు నా సమాధానం ఇదే అంటూ తన ప్రతినిధితో ఈడీ అధికారులకు లేఖ పంపారు. సుప్రీంకోర్టులో పిటీషన్ పెండింగ్ లో ఉందని.. కోర్టు నిర్ణయం తర్వాత హాజరవుతానని లేఖలో స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం అయితే ఉదయం 11 గంటలకే ఈడీ అధికారుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే తన న్యాయవాదులతో సుదీర్ఘంగా ఇంట్లోనే చర్చించారు కవిత.

Leave a Reply

%d