ఏమాయ చేసావో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత అతితక్కువ సమయంలోనే అగ్రకథానాయికగా వెలుగుతోంది. గత 13 సంవత్సరాలుగా ఇంకా అగ్రనాయికగా కొనసాగుతున్నది. అందం, అభినయంతో తనకంటూ అభిమానులను సంపాదించుకున్నది. కొంత కాలంగా సామ్ తన వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నది. మరో వైపు మయోసైటిస్ సమస్యతో పోరాడుతూనే.. వరుస చిత్రాల్లో నటిస్తున్నది. త్వరలో ‘శాకుంతలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ బాధ్యతలను భుజాన వేసుకున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రచార కార్యక్రమాల్లో సామ్ పాల్గొన్నది.
ఆ ఇద్దరు హీరోయిన్ల ప్లాన్ అదేనా ?

తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో ‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ ట్విట్టర్ వేదికగా సమంతను ఆసక్తికరమైన ప్రశ్న వేసింది. ‘శాకుంతలం చూడటానికి ఇంకా నేను వెయిట్ చేయలేను. మీరు చాలా స్ఫూర్తిదాయకం సామ్. మనమిద్దరం కలిసి ఎప్పుడూ చేద్దాం’..? అంటూ ప్రశ్నించింది. దీనికి సమంత స్పందిస్తూ ‘గుమ్రా చిత్రానికి మీకు శుభాకాంక్షలు మృణాల్. నాకు ఈ ఐడియా నచ్చింది. మనిద్దరం కలిసి ఓ చేద్దాం’ అంటూ సమాధానం ఇచ్చింది. వీరిద్దరి ముచ్చట నెట్టింట వైరల్ అవుతున్నది. మీరిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని ఉందంటూ పలువురు నెటిజన్స్ స్పందించారు. మృణాల్ తెలుగులో నటించిన చిత్రం ‘సీతా రామం’ చిత్రంతో భారీగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం నానీ 30 చిత్రంలో నటిస్తున్నది.