సె*క్స్, లస్ట్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్.

ఒకే ఒక్క సినిమాతో తెలుగులో స్టార్ డమ్ తెచ్చుకున్న భామ మృణాల్ ఠాకూర్. ‘సీతారామం’లో ఆమె నటనకు ఫిదా అవ్వని వారుండరు. మహారాణి పాత్రలో ఆమె నటించిన తీరు అద్భుతం. ఆ సినిమాతో ఈ అమ్మడుకు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. బుల్లితెరపై నుండి వెండితెరపైకి ఉవ్వెత్తున ఎగసిపడిన ఈ అందానికి, నటనకు సినీ ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు. హిందీ సీరియల్స్‌లో చేసిన ఆమె.. ఆ తర్వాత మరాఠి సినిమాల ద్వారా తెరకు పరిచయమైంది. సూపర్ 30లో హృతిక్ సరసన నటించిన ఈ బ్యూటీ.. బాట్లా హౌస్, ఘోస్ట్ స్టోరీస్, తుఫాన్, ధమకా వంటి క్రేజీయస్ట్ ప్రాజెక్టుల్లో పనిచేసి పలు హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.

సీతారామంతో తెలుగు తెరపైన కూడా మెప్పించింది. అయితే అందులో ఆమె కట్టు బొట్టును చూసి.. అచ్చ తెలుగు అమ్మాయిగా ఓన్ చేసుకున్నారు ఇక్కడి వారు. అయితే ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో, సోషల్ మీడియాలో ఆమెను చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. మనమ్మాయేనా అనిపించేలా ఆమె హాట్ లుక్స్‌లో దర్శనమిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె ఓ వెబ్ సిరీస్‌లో నటించారు. అదే యాంథాలజీ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2. జీవితంలో సెక్స్ ప్రాధాన్యతను తెలియజేసేలా నాలుగు కంటెంట్లతో ఈ సిరీస్ రూపొందించారు. ఇందులో మృణాల్ ఠాకూర్, తమన్నా, కాజోల్, నీనా గుప్తా, విజయ్ వర్మ వంటి తారలు నటించారు. ఈ నెల 29 నుండి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా సెక్స్, లస్ట్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ‘ఈరోజుల్లో శృంగారం – కామం అనేది చాలా కామన్‌గా ఇంట్లో మాట్లాడుకుంటున్నారు. నిజానికి అలా మాట్లాడుకోవాలి కూడా. ఈరోజుల్లో పిల్లలకి అసలు శృంగారం అంటే ఏంటి..? అట్రాక్షన్ అంటే ఏంటి..? అనేది క్లియర్‌గా చెప్పాలి. అప్పుడే అసలు విషయం తెలిసి వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు . వాటి గురించి మనం మాట్లాడడానికి సిగ్గుపడకూడదు. ఇలాంటి టాపిక్స్ పై ఇంట్లోనే పిల్లలకు నిజాయితీగా వివరిస్తే ప్రతి ఒక్కరి లైఫ్ బాగుంటుంది’ అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ఆమె నానితో, విజయ దేవర కొండతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది.

Leave a Reply

%d