తన రేటు పెంచేసిన మృణాల్ ఠాకూర్

సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిందా..? ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఇదే మాట్లాడుకుంటున్నారు. సీతారామం మూవీ తో యావత్ సినీ ప్రేక్షకులను, యూత్ ను తనవైపు తిప్పుకున్న మృనాల్ ఠాకూర్.. సినిమాలో అచ్చమైన చీర కట్టులో ఏమాత్రం అందాల ఆరబోత చేయకుండా తెలుగు అమ్మాయిల కనిపించి ఆకట్టుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడం తో అమ్మడికి భారీగా ఛాన్సులు వస్తున్నాయి. కానీ అమ్మడు మాత్రం ఆచితూచి ఓకే చెపుతుంది. ప్రస్తుతం నాని, విజయ్ దేవరకొండ , రానా ల సరసన నటిస్తుంది. ఈ మూడు చిత్రాలు సెట్స్ ఫై ఉన్నాయి. అంతే కాదు సోషల్ మీడియా లోను అందాల ఆరబోత తో ఫాలోయర్స్ ను పెంచుకుంటుంది.

ఇలా ఎక్కడ చూడు అమ్మడి గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో నిర్మాతలు వారి సినిమాల్లో మృణాలే కావాలని పట్టుబడుతున్నారు. దీంతో దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సమేత లాగా అమ్మడు క్రేజ్ ఉన్నప్పుడే డబ్బు సంపాదించాలని భావిస్తుంది. నిన్నమొన్నటి వరకు లక్షల్లో రెమ్యునరేషన్ అందుకున్న మృణాల్ ఇప్పుడు కోట్లు అడుగుతుందట. ఒకొక్క సినిమాకు రెండు నుంచి మూడు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని ఫిలిం నగర్ టాక్. అలాగే ఈ అమ్మడు తమిళ్ లోనూ సినిమా అవకాశం అందుకుందట. ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద మృణాల్ తన డిమాండ్ ను గట్టిగా వాడుకుంటుంది.

Leave a Reply

%d bloggers like this: