ఆస్కార్ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి నామినేషన్లు ఇవే

కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో ఆస్కార్ నామినేషన్లు ప్రకటించారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి కేటగిరీల్లో తుది నామినేషన్లు పొందిన వారి వివరాలు వెల్లడించారు.

ఉత్తమ నటుడు కేటగిరీ.

పాల్ మెస్కల్ (ఆఫ్టర్ సన్)
బిల్ నైయీ (లివింగ్)
బ్రెండన్ ఫ్రేజర్ (ద వేల్)
ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్)
కొలిన్ ఫారెల్ (ద బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)

ఉత్తమ నటి కేటగిరీ.
కేట్ బ్లాంచెట్ (టార్)
మిచెల్లీ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్)
ఆండ్రియా రైజ్ బరో (ట లెస్లీ)
అనా డి అర్మాస్ (బ్లాండే)
మిచెల్లీ విలియమ్స్ (ద ఫేబుల్ మాన్స్)

ఇక మొదటిసారి ఓ తెలుగు పాట ఆస్కార్ అవార్డుల బరిలో అడుగుపెట్టింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ ఖరారైంది. ఇవాళ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆస్కార్ అవార్డుల తుది నామినేషన్ల ప్రకటన కార్యక్రమం జరుగుతోంది.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట చోటు దక్కించుకుంది. ఇదే కాకుండా, ఈ కేటగిరీలో హోల్డ మై హ్యాండ్ (టాప్ గన్ మావెరిక్), దిసీజ్ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్), అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమన్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్) గీతాలు కూడా ఆస్కార్ తుది నామినేషన్లలో చోటు దక్కించుకున్నాయి.

ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు కీరవాణి బాణీలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ సమకూర్చిన నృత్యరీతులు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయి.

Leave a Reply

%d