అగ్ని ప్రమాద ఎందుకు జరిగిదంటే

రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించడం తెలిసిందే. ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ వేర్ భవనంలో ఇప్పటికీ మంటలు ఎగసిపడుతున్నాయి. మూడు వైపుల నుంచి మొత్తం 15 ఫైరింజన్లను మోహరించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నికీలలను అదుపులోకి తెచ్చేందుకు రసాయనాలు కూడా వినియోగిస్తున్నారు.  కాగా, దట్టమైన పొగ కారణంగా ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇప్పటివరకు భవనంలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. భవనంలో ఇక ఎవరూ లేరని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
మరోపక్క, డెక్కన్ స్పోర్ట్స్ మాల్ కు పక్కనే ఉన్న నాలుగు భవనాలకు కూడా మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. పరిసరాల్లోని భవనాల్లో నివసిస్తున్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అంతేకాదు, ఆ ప్రాంతంలో ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు.

స్పోర్ట్స్ షాప్ లో ఇంకా ఏమైనా ఉండొచ్చా అని అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. స్పోర్ట్స్ షాప్ లో రెగ్జిన్ సంబంధించిన క్లాత్ గోదాంలో నిల్వ ఉంచినట్లు తెలుస్తుంది. రెగ్జిన్ క్లాత్ వల్లనే దట్టమైన పొగలు వస్తున్నాయా..? లేక ఇంకా ఏమైనా నిలువలు ఉన్నాయా..? అనే విషయంపై అధికారులు ఆరాధిస్తున్నారు. మంటలు, పొగ అదుపులోకి వచ్చాక పూర్తిస్థాయిలో కమిటీ వేసి విచారణ జరిపిన తర్వాత అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.

ఈ భవనంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీని మీద అధికారులు స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వలేదు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తరువాత ఫోరెన్సీ అధికారులు పంచనామా నిర్వహించిన తరువాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

%d