ప్రముఖ సినీ హీరో నందమూరి తారకరత్న మరణించి దాదాపు రెండు నెలలు గడుస్తోంది. ఇంకా.. ఆయన కుటుంబం ఆ బాధ నుంచి తేరుకోలేకపోతోంది. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య, పిల్లలు ఆయన లేని లోటును ఎంతో బాధతో అనుభవిస్తున్నారు. అలేఖ్య తరచుగా భర్తపై తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. అవి కాస్తా వైరల్‌గా మారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ వార్త సినీ, రాజకీయ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అలేఖ్య తన భర్త చివరి కోరిక తీర్చడానికి సిద్దమవుతున్నారట. ఎమ్మెల్యేగా టీడీపీ తరపు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారట.
For More News Click: https://eenadunews.co.in/
2024 ఎన్నికల్లో గుడివాడ నుంచి ఆమె పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సంగతేంటంటే.. తమకు ఎంతో ఇబ్బందిగా మారిన కొడాలి నానికి చెక్ పెట్టడానికి చాలా ఏళ్ల నుంచి టీడీపీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తారకరత్న తన మరణానికి ముందు గుడివాడ నుంచి కొడాలి నానిపై పోటీ చేయాలని భావించారట. ఈ మేరకు అన్ని ఏర్పాటు పూర్తి చేసుకున్నారట. పోటీకీ అంతా క్లియర్ అనుకున్న సమయంలో ఆయన గుండెపోటుకు గురై మరణించారు. ఇప్పుడు తన భర్త ఆఖరి కోర్కెను తీర్చడానికి అలేఖ్య ఆ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. అయితే, ఆ స్థానం నుంచి ఆమెను పోటీ చేయించేందుకు చంద్రబాబు నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదట. ఒకవేళ ఆయన నుంచి కన్మర్మేషన్ వస్తే అలేఖ్య పోటీకి దిగుతారని సమాచారం.