నరేష్-పవిత్రా లోకేష్.. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. అసలు వీళ్లు నిజంగానే పెళ్లి చేసుకున్నారా? ప్రస్తుతం కలిసే ఉంటున్నారా? ఇలా ఒకటి రెండు కాదు చాలా ప్రశ్నలు.. నెటిజన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇది కాదన్నట్లు రీసెంట్ గా ప్రతి ఈవెంట్ లోనూ పవిత్ర పేరు ప్రస్తావించకుండా నరేష్ మాట్లాడటం లేదు. For More News Click: https://eenadunews.co.in/ తాజాగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మల్లెపూలతో కనిపించిన నరేష్.. తాజాగా ఓ షోలో పవిత్రతో కలిసి సందడి చేశారు. అక్కడితే ఆగకుండా డైరెక్ట్ గా పబ్లిక్ గా ముద్దులతో రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
For More News Click: https://eenadunews.co.in/
అసలు విషయానికొస్తే.. టాలీవుడ్ లో చాలా ఏళ్లుగా నరేష్ మూవీస్ చేస్తున్నాడు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ‘మళ్లీ పెళ్లి’ అనే మూవీలో హీరోగా నటిస్తూ హాట్ టాపిక్ గా మారిపోయారు. ఈ మూవీ ఎందుకింతలా వైరల్ అయిందంటే.. ఇది నరేష్ బయోపిక్ అని అంటున్నారు. ఇందులో రియల్ లైఫ్ లో నరేష్ తో కలిసుంటున్న పవిత్రా లోకేష్ లీడ్ రోల్ చేయడం ఇంతలా ఈ మూవీ గురించి మాట్లాడుకోవడానికి కారణమైంది. తాజాగా వీళ్లిద్దరూ ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్ సెన్స్ సీజన్ 5లో సందడి చేశారు. కానీ ఓ సందర్భంగా ముద్దులతో రెచ్చిపోయారు.
For More News Click: https://eenadunews.co.in/
ఇక షోలో ఎంటర్ టైన్ చేసిన నరేష్-పవిత్రా లోకేష్ ని హోస్ట్ ఓంకార్.. ‘మీ రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి?’ అని అడిగాడు. దీనికి సమాధానమిచ్చిన నరేష్.. ‘భూమి బద్దలైనా, ఆకాశం ఊడిపడినా మేమిద్దరం కలిసే ఉంటాం’ అని ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ‘మీరు ముద్దుగా పవిత్రని ఏమని పిలుస్తారు?’ అని ఓంకార్ అడగ్గా.. ‘అమ్ములు అని పిలుస్తాను. ఇంకా ప్రేమ ఎక్కువైతే అమ్ము అంటాను. ఇంకా ప్రేమ ఎక్కువైతే వద్దులే చెప్తే బాగోదు’ అని ముసిముసి నవ్వులు నవ్వారు. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త వైరల్ అయింది. మరి పబ్లిక్ గా షోలో నరేష్, For More News Click: https://eenadunews.co.in/ పవిత్రను ముద్దుపెట్టడంపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.