స్పా ముసుగులో వ్యభిచారం.. నెల్లూరులో 14 మంది అరెస్టు

మెట్రో నగరాలకు పరిమితమైన స్పా బిజినెస్ ఇప్పుడు జిల్లాలకు వ్యాప్తించెందింది. శరీరానిక మర్ధన పేరుతో గట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.  హైదరాబాద్ లో అనేక సార్లు పోలీసులు దాడులు చేసి అరెస్ట్ లు చేశారు. అయితే రూటు మార్చిన స్పా సెంటర్ల నిర్వహకులు పెద్ద స్థాయి జిల్లా కేంద్రాల్లో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టి డబ్బులు దండుకుంటున్నారు. ఈ స్పా సెంటర్లపై కన్నేసిన పోలీసులు దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..నెల్లూరు నగరంలో స్పా సెంటర్ల పై శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పా ముసుగులో పలువురు వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు ఆరుగురు యువతులు, ఆరుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్లపై దాడులు కొనసాగుతున్నాయి.

Leave a Reply

%d bloggers like this: