హైదరాబాద్​లో విధ్వంసాలకు లష్కరే కుట్ర

హైదరాబాద్ లో వరుస బాంబు పేలుళ్లకు ప్లాన్  చేసిన లష్కరే తోయిబా కుట్ర కేసులో నేషనల్  ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌‌ఐఏ) బుధవారం ఎన్ఐఏ కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. బాంబు పేలుళ్లకు కుట్ర చేసిన మహ్మద్  అబ్దుల్ వాజిద్  అలియాస్‌‌  జాహెద్, సమీయుద్దీన్  అలియాస్‌‌  సమీ, మాజ్ హసన్  ఫారూక్  అలియాస్‌‌  మాజ్‌‌లపై అభియోగాలు మోపింది. నిధులు, పేలుడు పదార్థాలు సేకరించడం, రిక్రూట్‌‌మెంట్ చేయడం వంటి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించారని చార్జిషీటులో ఎన్ఐఏ పేర్కొంది. నిరుడు దసరా ఉత్సవాలతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్  సమావేశాలు, ర్యాలీల్లో హ్యాండ్‌‌  గ్రెనేడ్లలతో దాడులు చేసేందుకు నిందితులు ప్లాన్ చేశారని తెలిపింది. ఈ కేసులో అక్టోబర్ 2న  మలక్‌‌పేట్‌‌ మూసారాంబాగ్‌‌కి  చెందిన అబ్దుల్‌‌ జాహెద్‌‌, సైదాబాద్‌‌  అక్బర్‌‌‌‌బాగ్‌‌‌‌కి చెందిన సమీయుద్దీన్‌‌, హుమాయున్‌‌  నగర్‌‌‌‌  రాయల్‌‌ కాలనీకి చెందిన మాజ్‌‌ హసన్‌‌  ఫరూక్‌‌లను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు హ్యాండ్  గ్రెనేడ్లు, రూ.5.41 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

%d