నిఖత్‌ జరీన్‌ పసిడి పంచ్‌.. వరుసగా రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌!

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌(wWBC)లో భారత్‌ స్వర్ణాల పంట పండిస్తోంది. ఇప్పటికే రెండు బంగారు పతకాలు కైవసం చేసుకున్న భారత్.. తాజాగా మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. 50 కిలోల విభాగంలో తెలంగాణ సంచలనం నిఖత్‌ జరీన్‌ (Nikhat Zareen) పసిడి కొల్లగొట్టింది. ప్రత్యర్థి, రెండు సార్లు అసియా ఛాంపియన్‌షిప్‌ గెలుచుకున్న వియత్నాంకు చెందిన గుయెన్‌ టాన్‌పై 5-0తో విజయం సాధించింది. నిఖత్‌ జరీన్‌ వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అదరగొట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

%d