మోదీకి విపక్ష నేతల లేఖ

మద్యం కుంభకోణం కేసులో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా అరెస్టును ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి తొమ్మిది మంది విపక్ష నేతలు లేఖ రాశారు. దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తోందని నేతలు ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. లేఖ రాసిన వారిలో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌, భగవంత్‌ మాన్‌, మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ ఠాక్రే, ఫరూక్‌ అబ్దుల్లా, శరద్‌ పవార్‌, అఖిలేశ్, తేజస్వి యాదవ్‌ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అధికారాలు, ఆకాంక్షలే అన్నిటికంటే కీలకమన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాలని పేర్కొన్నారు.

Leave a Reply

%d