లిక్కర్ కేసులో ఎంపీ కొడుక్కుకి దొరకని బెయిల్

ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ… వేసిన పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈ కేసులో రాఘవ అరెస్ట్ అయ్యి.. రిమాండ్ లో ఉన్నారు. ఇక మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ అధికారులు ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డితో పాటు రాఘవపైనా అభియోగాలు చేశారు. ఈడీ కేసుకు సంబంధించి రాఘవ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం మాగుంట రాఘవ తీహార్ జైలులో ఉన్నారు.

Leave a Reply

%d