మంచి రోజులకు నెల రోజుల పాటు బ్రేక్ – మీనాక్షి

పుష్యమాసం ఆరంభం కావడంతో శనివారం నుంచి శుభకార్యాలకు బ్రేక్‌ పడింది. ఈ శూన్యమాసం వచ్చే నెల 22వ తేదీ వరకు ఉంటుంది. అయితే సుమారు నెల రోజుల పాటు మంచి ముహూర్తాలు లేనందున ఏ శుభ కార్యాలు చేపట్టలేని పరిస్థితి. వచ్చే నెల 25 తర్వాత మార్చి వరకు శుభముహుర్తాలున్నాయి. ఆయా ముహూర్తాల్లోనే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు జరుపుకోవడానికి జిల్లా వాసులు సన్నాహాలు చేసుకుంటున్నారు. వాస్తవంగా ఈ ఏడాది ఆగస్టు 24 నుంచి శుక్ర మౌఢ్యమి కావడంతో నవంబరు 25 వరకు శుభ ముహూ ర్తాల్లేవు. మార్గమాసం రావడంతో ఈ నెల 2 నుంచి 22 వరకు వివాహాలు, గృహాప్రవేశాలు తదితర శుభ కార్యక్రమాలు జోరుగా జరిగాయి.

Leave a Reply

%d