అగ్నివీరుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల

అగ్నివీరుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. వివిధ జోన్లలో నిర్వహించే పరీక్షకు సంబంధించి ఇండియన్‌ ఆర్మీ వేర్వేరుగా షెడ్యూల్‌ జారీ చేసింది. తెలంగాణలో నిర్వహించే ప్రాథమిక అర్హత పరీక్షకు ఈనెల 16వ నుంచి మార్చి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఏప్రిల్ 17 తేదీ నుంచి అగ్నివీర్ ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వాళ్లకు ఆర్మీ నియామక ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంటుందని పేర్కొంది. http://www.joinindianarmy.nic.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Leave a Reply

%d