ఎన్టీఆర్ కొత్త సినిమా ఇదే

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి కొత్త చిత్రమేమీ రాలేదు. అయితే కొరటాల శివతో ఎన్టీఆర్ అంగీకరించిన సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్రబృందం నేడు ప్రకటించింది. 2024 ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమా ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.  ఎన్టీఆర్ కు ఇది 30వ సినిమా. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కల్యాణ రామ్ నిర్మిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ పంచుకుంటామని యువసుధ ఆర్ట్స్ వెల్లడించింది.

Leave a Reply

%d bloggers like this: