ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ లో అర్థరాత్రి అశ్లీల దృశ్యాలు

హైదరాబాద్‌లోని ఓ తెలుగు టీవీ ఛానల్‌లో ఈ నెల 28న అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా అశ్లీల దృశ్యాలు ప్రసారం కావడం సంచలనంగా మారింది. దీంతో, షాకయిపోయిన నిర్వాహకులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.

For More News Click: https://eenadunews.co.in/

తమది లైవ్ ఛానల్ అని, అర్ధరాత్రి 15 నిమిషాల పాటు అశ్లీల దృశ్యాలు ప్రసారమయ్యాయని పేర్కొన్నారు. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాటిని తొలగించారని పేర్కొన్నారు. తమ సర్వర్‌ను ఎవరో హ్యాక్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన నిర్వాహకులు, ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు. బంజారా హిల్స్ రోడ్ నెం.12, ఎమ్యెల్యే కాలనీలో ఛానల్ కార్యాలయం ఉంది.

Leave a Reply

%d bloggers like this: