మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. థాయ్ లాండ్ వెళ్లి రావొచ్చు. ఇంకా ఇతర బెనిఫిట్స్ ఉంటాయి.
పెట్రోల్ రేట్లకు చుక్కలు కనిపిస్తున్నాయా? అందుకే బడ్జెట్ ధరలో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం మార్కెట్‌లో పలు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్‌కు అనుగుణంగా నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయొచ్చు. అయితే ప్రస్తుతం ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ ఆఫర్ లభిస్తోంది. కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారికి కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. దీంతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ఇదే సరైన సమయం అని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఒకాయ ఈవీ సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్ అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా మరో డీల్ కూడా అందుబాటులో ఉంచింది. కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే వారు థాయ్ లాండ్ టూర్‌కు ఉచితంగా వెళ్లి రావొచ్చు. నాలుగు రోజులు పాటు ఈ టూర్ జరుగుతుంది.
ఒకాయ కార్నివాల్‌లో భాగంగా కంపెనీ ఈ ఆఫర్లు అందుబాటులో చింది. థాయ్ లాండ్ ట్రిప్ ఒక్కరికి మాత్రమే ఉంటుంది. ఆఫర్ ఏప్రిల్ నెల చివరి వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. సాధారణంగా మార్చి నెలతోనే ఆఫర్ ముగియాల్సి ఉంది. అయితే కంపెనీ దీన్ని ఏప్రిల్ చివరి వరకు పొడిగించింది.