పెట్రోల్ బండి ఇచ్చి ఎలక్ట్రిక్ బండి తీసుకొండి

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై హోలీ ఆఫర్స్ ప్రకటించింది కంపెనీ. మార్చి 8 నుంచి 12వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ ఉంటాయని ప్రకటిస్తూ.. ఆఫర్స్ వివరాలను వెల్లడించింది కంపెనీ.  ఓలా ఎస్ 1 వేరియంట్ పై 2 వేల రూపాయలు, ఎస్ 1 ప్రో వేరియంట్ పై 4 వేల రూపాయల వరకు డిస్కొంట్ ఇస్తున్నారు. అంతే కాకుండా ఓలా ఎక్స్ పీరియన్స్ సెంటర్ ద్వారా 6 వేల 999 రూపాయల వరకు స్పెషల్ డిస్కొంట్ అనౌన్స్ లభిస్తుంది.అలాగే ఓలా కమ్యూనిటీ సభ్యులకు ఓలా ప్లస్ సబ్ స్క్రిప్షన్, ఎక్సెంటెడ్ వారంటీస్ పై 50 శాతం వరకు డిస్కొంట్ లభిస్తుంది.  మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ పాత పెట్రోల్ బండి.. టూ వీలర్ ఎక్సేంజ్ ఆఫర్ సైతం ప్రకటించింది. పాత పెట్రోల్ బండికి గరిష్టంగా 45 వేల రూపాయల వరకు ఆఫర్ ఇస్తుంది. ఆయా బండిని కండీషన్, మోడల్, కంపెనీ ఆధారంగా ఈ డిస్కొంట్ లభిస్తుంది. వీటితో పాటు ఓలా సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా ప్రకటించింది కంపెనీ.. ఓలా కేర్ ప్లాన్ ద్వారా ఫ్రీ లేబర్ సర్వీస్, టెస్ట్ అసిస్టెన్స్, రోడ్ సైడ్ అసిస్ట్, పంచర్ అసిస్ట్ వంటి సేవలు లభిస్తాయి. అదే విధంగా ఓలా కేర్ ప్లస్ విషయానికి వస్తే.. ఫ్రీ హోం సర్వీస్, ఫ్రీ అంబులెన్స్, పికప్ అండ్ డ్రాప్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు. కంపెనీ టూ కస్టమర్ సేవలను విస్తరించే పనిలో భాగంగానే ఈ ఆఫర్స్ ప్రకటించినట్లు తెలిపింది ఓలా. హోలీ సందర్భంగా ఇచ్చిన ఈ ఆఫర్స్ మార్చి 12వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్ లో ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ ధర లక్షా 20 వేల రూపాయలపైనే ఉంది. పెట్రోల్ బైక్ ఎక్సేంజ్ ద్వారా సేల్స్ పెరుగుతాయని భావిస్తుంది కంపెనీ.

Leave a Reply

%d