గంటలో కాలినడకతో చుట్టేసే దేశం.. అది ఏ దేశమో తెలుసా..?

మనం సాధారణంగా టూర్ కు వెళ్లి అక్కడున్న ప్రదేశాన్ని చూడటానికి కొన్ని గంటల సమయం పడుతుంది.దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కొంత సమయం పడుతుంది.ఈ క్రమంలో కొన్ని వింతైన ప్రదేశాలు, వింతైన వస్తువులను చూస్తుంటాం. అందులో మనకు కొన్ని తెలియని వింతలు చాలా ఉంటాయి. వాటిని చూసినప్పుడు వాటి గురించి తెలుసుకున్నప్పుడు చాలా అనుభూతి పొందుతాం. అవి టూరిజం ప్లేస్ లు కావచ్చు, వస్తువులు కావచ్చు, వింత సంఘటనలు కావచ్చు.కాని వేరే దేశం వెళ్లి అక్కడ ప్రదేశాలన్నీ చుట్టి రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. అలాంటిది ఒక గంటలోనే ఒక దేశాన్నిసందర్శించే అవకాశం ఉందంటే నమ్మగలరా? ఉంది అది వ్యాటికన్ సిటీ. వివరాల్లోకి వెళితే..

For More News Click: https://eenadunews.co.in/

ప్రపంచంలో కొన్ని వినడానికి, చూడటానికి చాలా చిత్రంగా అనిపించినా.. అవి వాస్తవం అని తెలిస్తే.. షాక్ తింటాం. ప్రపంచంలో ఓ పట్టణం అతి చిన్న దేశంగా పేరు పొందింది.  ప్రపంచంలో భూప్రదేశం పరంగా రష్యా అతి పెద్ద దేశంగా, అతి చిన్న దేశంగా వ్యాటికన్ సిటీ పేరొందింది. ప్రముఖ పట్టణాలలో ఒకటి వ్యాటికన్ సిటీ.  ఈ సిటీ ప్రత్యేకలు, ప్రాముఖ్యతలు కి ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి.  ఈ దేశానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిని హోలీ సీ అని పిలుస్తారు. రోమన్ కాథలిక్ ప్రధాన చర్చి కి నిలయం.ఇది క్రైస్తవులకు పవిత్ర స్థలం.ఈ దేశంల మొత్తం వైశాల్యం 0.17 చదరపు మైళ్లు మాత్రమే. చుట్టూ నడవడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. ఇక్కడ నివసించే జనాభా 825 మంది.

అయితే ఈ దేశానికున్న ప్రత్యేకతలు చెప్పుకుంటే.. ఇక్కడ నేరాలు చేసిన వారికి ఇటలీలో శిక్ష విధిస్తారు. ఈ దేశంలో నేరాల చాలా తక్కువగా జరుగుతాయి. ప్రపంచంలోనే జైలు లేని ఏకైక దేశం వ్యాటికన్ సిటీ.వరల్డ్ లోనే అతి చిన్న రైలు మార్గం కలిగి, ఒక రైల్వే స్టేషన్ కలిగిన దేశంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒక్కసారి ఈ ప్రాంతాన్ని తిలకించిన వారు మళ్లీ మళ్లీ రావాలనిపించేలా ఉంటుంది. అందుకే చాలా మంది వాటికన్ సిటీ చూసేందుకు ఇష్టపడుతుంటారు.

Leave a Reply

%d