జమిలి ఎన్నికలకు రూ. 9300 కోట్ల అంచనా

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ఏకంగా రూ.9,300 కోట్లు ఖర్చు అవుతాయని ఎన్నికల సంఘం గతంలోనే అంచనా వేసింది. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఎన్నికల అనంతరం తిరిగి వాటిని భద్రపరిచేందుకు కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు డిసెంబర్ 2015లోనే న్యాయ, ప్రజాఫిర్యాదులు, సిబ్బందిశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం ఇచ్చిన నివేదికలో ఎన్నికల సంఘం ఈ అంశాలను ప్రస్తావించింది.

తాజాగా మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ ఎన్నికల ఖర్చు అంశంపైనా దృష్టిపెట్టనుంది. ఈ కమిటీ 15 రోజుల్లోనే నివేదిక సమర్పించే అవకాశాలులేవు. ఒకవేళ సమర్పించినా ఐదు రాజ్యాంగ సవరణలు చేయడం, సగం రాష్ట్రాల ఆమోదం పొందడం అంత సులువైన విషయం కాదు. ఈ నేపథ్యంలో ఈసారి పాక్షిక జమిలి ఎన్నికలు నిర్వహించాలని, లోక్‌సభతోపాటు 10-12 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

%d